: దివి నుంచి భువికి తిరిగొచ్చిన 'స్పేస్ సింగర్'


అంతరిక్షంలో పాటపాడి సంచలనం సృష్టించిన కెనడా వ్యోమగామి క్రిస్ హాడ్ ఫీల్డ్ భూమికి తిరిగొచ్చాడు. గత ఆరునెలలుగా అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్)లో పలు పరిశోధనల్లో పాలు పంచుకున్న హాడ్ ఫీల్డ్ ఈ రోజు కజకిస్తాన్ వద్ద భూమిని చేరుకున్నారు. ఐఎస్ఎస్ నుంచి హాడ్ ఫీల్డ్ తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములను సోయుజ్ వాహక నౌక సురక్షితంగా కిందికి తీసుకువచ్చింది. కాగా, స్పేస్ స్టేషన్ లో ఉన్నప్పుడు హాడ్ ఫీల్డ్.. డేవిడ్ బోవీ సూపర్ హిట్ గీతం 'స్పేస్ ఆడిటీ'ని ఆలపించి వీడియో తీసి దాన్ని యూట్యూబ్ లో ఉంచగా, లక్షలాది హిట్ లు సొంతం చేసుకుంది.

  • Loading...

More Telugu News