sunil gavaskar: బయోపిక్ తీసేంత ఆసక్తికరంగా నా జీవితం లేదు: గవాస్కర్

  • నాది సాధారణమైన రొటీన్ లైఫ్
  • బయోపిక్ ప్రపోజల్స్ ఇప్పటికే వచ్చాయి
  • నా బయోపిక్ పై నాకు ఆసక్తి లేదు

క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ధోనీ తదితరుల జీవిత కథతో బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. మరోవైపు సునీల్ గవాస్కర్ బయోపిక్ తీసేందుకు కూడా బాలీవుడ్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గవాస్కర్ స్పందిస్తూ, తన బయోపిక్ పై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని చెప్పారు. తన జీవితం బయోపిక్ తీసేంత ఆసక్తికరంగా ఉండదని అన్నారు. తనది సర్వసాధారణమైన రొటీన్ లైఫ్ అని చెప్పారు. ఒక సినీ ప్రేక్షకుడిగా కూడా తన బయోపిక్ ను తెరపై చూడాలనుకోవడం లేదని... అలాంటప్పుడు ఇతరులకు మాత్రం ఆసక్తి ఎందుకు ఉంటుందని అన్నారు. బయోపిక్ తీస్తామంటూ ఇప్పటికే తన వద్దకు ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయని తెలిపారు.

sunil gavaskar
biopic
bollywood
  • Loading...

More Telugu News