Andhra Pradesh: న్యూజిలాండ్ విషాద ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా: సీఎం చంద్రబాబు

  • న్యూజిలాండ్ లోని రెండు మసీదుల్లో ఘటన దారుణం
  • గాయపడ్డ భారతీయులకు ఎన్ఆర్ లు అండగా నిలవాలి
  • బాధిత కుటుంబాలకు సహాయ, సహకారాలందించాలి

న్యూజిలాండ్ లోని రెండు మసీదుల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 49 మంది మృతి చెందిన విషాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. రెండు మసీదుల్లో జరిగిన మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. దుండగుడి దాడిలో మృతి చెందిన, గాయపడ్డ భారతీయులకు, వారి కుటుంబాలకు అక్కడి ప్రవాస భారతీయులంతా అండగా నిలవాలని కోరారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక్కటిగా బాధిత కుటుంబాలకు సహాయ, సహకారాలు అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Andhra Pradesh
cm
Chandrababu
newzeland
  • Loading...

More Telugu News