anushka: అనుష్క 'సైలెన్స్' షూటింగులో జాయినైన హాలీవుడ్ నటుడు

  • అనుష్క ప్రధాన పాత్రధారిగా 'సైలెన్స్'
  • కీలకమైన పాత్రలో మాధవన్ 
  • యూఎస్ లో ఎక్కువభాగం చిత్రీకరణ  

'అరుంధతి' .. 'రుద్రమదేవి' .. 'భాగమతి' వంటి సినిమాలు అనుష్క నటనా పటిమకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. ఈ సినిమా తరువాత నాయికా ప్రాధాన్యత కలిగిన మరో సినిమా చేయడానికి ఆమె రంగంలోకి దిగింది .. ఆ సినిమా పేరే 'సైలెన్స్'. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, ఇంతవరకూ చేయని ఒక విభిన్నమైన పాత్రలో అనుష్క కనిపించనుంది.

ఈ సినిమాలో మాధవన్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండగా .. మరో కీలకమైన పాత్రలో హాలీవుడ్ నటుడు 'మైఖేల్ మాడిసన్' కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగులో ఆయన జాయిన్ అయ్యాడనేది తాజా సమాచారం. కథాకథనాలపరంగా ఈ సినిమా షూటింగును యూఎస్ లో ఎక్కువగా జరపనున్నారు. తెలుగుతో పాటు తమిళ.. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News