Andhra Pradesh: వైసీపీలోకి భారీగా వలసలు.. నేడు పార్టీలో చేరనున్న మాగుంట, ఆదాల, బుట్టా రేణుక!

  • పులివెందుల నుంచి ఇడుపులపాయకు జగన్
  • వైఎస్ కు నివాళులు అర్పించి హైదరాబాద్ కు పయనం
  • వివేకానందరెడ్డి హత్యపై నేడు గవర్నర్ కు ఫిర్యాదు

వైసీపీ అధినేత జగన్ తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియల అనంతరం ఇడుపులపాయకు బయలుదేరారు. అక్కడ తండ్రి  వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించిన తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లనున్నారు. కాగా, హైదరాబాద్ కు వచ్చాక పార్టీ నేతలతో కలిసి జగన్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలుసుకుంటారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేస్తారు. కాగా, ఈ సందర్భంగా వైసీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొణతాల రామకృష్ణ, ఆదాల ప్రభాక‌ర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వంగా గీత ఈరోజు వైసీపీలో చేరుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

వీరితో పాటు గతంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కర్నూలు లోక్ సభ సభ్యురాలు బుట్టా రేణుక, గూడూరు టీడీపీ నేత, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ సైతం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News