Telangana: దేవుని ఆశీర్వాదంతో వస్తున్నా.. మల్కాజ్ గిరి బిడ్డా.. మద్దతు ఇవ్వు!: రేవంత్ రెడ్డి

  • మల్కాజ్ గిరి నుంచి రేవంత్ పోటీ
  • 8 మంది పేర్లను ఖరారుచేసిన కాంగ్రెస్ హైకమాండ్
  • ఫేస్ బుక్ లో స్పందించిన కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ పార్టీ తరఫున మల్కాజ్ గిరి నుంచి రేవంత్ రెడ్డి పోటీచేయనున్న సంగతి తెలిసిందే. రేవంత్ తో పాటు రమేశ్‌ రాథోడ్‌(ఆదిలాబాద్‌), బలరాం నాయక్‌ (మహబూబాబాద్‌), ఎ.చంద్రశేఖర్‌(పెద్దపల్లి), పొన్నం ప్రభాకర్‌(కరీంనగర్‌), కె.మదన్‌మోహన్‌(జహీరాబాద్‌), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(చేవెళ్ల), గాలి అనిల్‌కుమార్‌(మెదక్‌)లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి దిగారు.


తాను మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్నానని ఆయన ఫేస్ బుక్ లో తెలిపారు. దేవుడి ఆశీర్వాదంతో వస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఫేస్ బుక్ లో రేవంత్ రెడ్డి స్పందిస్తూ..‘దేవుని ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నా..మల్కాజ్ గిరి బిడ్డా.. మద్దతు ఇవ్వు’ అని పోస్ట్ చేశారు.

Telangana
loksabha
elections-2019
malkajgiri
Facebook
Revanth Reddy
post
  • Loading...

More Telugu News