Andhra Pradesh: జనసేనకు ఎందుకు ఓటు వేయాలంటే.. నాదెండ్ల మనోహర్ వీడియో విడుదల!

  • తొలిసారి ఓటర్ల ముందు అద్భుతమైన అవకాశముంది
  • కుల,మత, ప్రాంతాలకు అతీతంగా పవన్ సేవ చేస్తారు
  • జనసేనకు 25 సంవత్సరాల విజన్ ఉంది

తొలిసారి ఓటు హక్కుపొందిన యువతీయువకుల ముందు అద్భుతమైన అవకాశం ఉందని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన పార్టీని, పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని బలపర్చడానికి ఇది గొప్ప అవకాశమని వ్యాఖ్యానించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేసేందుకు పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారనీ, అందుకే యువత ఓటును అడుగుతున్నామని చెప్పారు. ఈ మేరకు నాదెండ్ల మనోహర్ ఓ వీడియోను విడుదల చేశారు.

ప్రస్తుతం యువతకు గొప్ప భవిష్యత్ కావాలని నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీకి పాతికేళ్ల భవిష్యత్తుపై ఓ విజన్ ఉందని తెలిపారు. ఈ ప్రయాణంలో యువత జనసేనతో చేతులు కలపాలనీ, భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఆదర్శవంతంగా ఉన్న నేతలను ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం ఓట్ ఫర్ జనసేన, ఓట్ ఫర్ గ్లాస్, జైహింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
vote
nadendla manohar
  • Loading...

More Telugu News