Jagan: నేడు గవర్నర్ నరసింహన్‌ను కలవనున్న జగన్.. వివేకా హత్యపై ఫిర్యాదు

  • సాయంత్రం నాలుగు గంటలకు రాజ్‌భవన్‌కు వైసీపీ బృందం
  • రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఫిర్యాదు
  • రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేటి సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలుసుకోనున్నారు. పార్టీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లనున్న జగన్.. వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నారు. దీంతో పాటు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను గవర్నర్ దృష్టికి తెస్తారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఈ హత్యలు నిదర్శనమని ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు, వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో  రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించాలని కార్యకర్తలకు వైసీపీ పిలుపునిచ్చింది. నల్లచొక్కాలు, నల్ల రిబ్బన్లు ధరించి గాంధీ విగ్రహాల వద్ద నల్లజెండాలతో ప్రదర్శనలు చేపట్టాలని కోరింది.

Jagan
YSRCP
Governor
ESL Narasimhan
Vivekandareddy
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News