Hyderabad: అండర్ వేర్ లో రూ.46 లక్షల విలువైన బంగారంతో దొరికిపోయిన ప్రయాణికుడు
- డీఆర్ఐ అధికారుల తనిఖీ
- అండర్ వేర్ లో బంగారం దాచుకున్న వ్యక్తి
- సోదాల్లో బట్టబయలు
హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. మస్కట్ నుంచి వస్తున్న ఆ వ్యక్తి నుంచి రూ.46.25 లక్షల విలువైన 1398.31 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అండర్ వేర్ లో బంగారం దాచిపెట్టి, అధికారుల కళ్లుగప్పే ప్రయత్నం చేశాడు ఆ ప్రయాణికుడు. అయితే, నిశితంగా సోదాలు చేయడంతో అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం, ఇంటెలిజెన్స్ అధికారులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా తరచుగా జరుగుతున్న సంగతి తెలిసిందే.