Aravind babu: తాడికొండ స్థానంలో అభ్యర్థి మార్పు కోరుతూ.. టీడీపీ నేతల డిమాండ్

  • గుంటూరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు
  • అరవిందబాబుకు టికెట్ ఇవ్వొద్దంటూ ఆందోళన
  • శ్రావణ్‌కు తాడికొండ స్థానం ఇవ్వాలని డిమాండ్

పలు చోట్ల టీడీపీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎంతో కసరత్తు చేసి గెలిచే అభ్యర్థులకే ప్రాధాన్యమిచ్చారు. సీట్ల కేటాయింపులో కొన్ని చోట్ల వారసులకు కూడా స్థానమిచ్చారు. అయితే అభ్యర్థుల స్థానాల మార్పుతో పాటు.. కొందరు అభ్యర్థుల ఎంపికపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు గుంటూరు జిల్లాను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కానీ గుంటూరు జిల్లా నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

నరసరావుపేటలో అరవిందబాబుకు టికెట్ ఇవ్వొద్దంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేసీఆర్‌ని పొగిడిన వ్యక్తికి టికెట్ కేటాయించడమేంటని నిలదీశారు. నరసరావుపేట నుంచి టీడీపీ కార్యకర్తలు వాహనాల్లో భారీగా చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. మరోవైపు తాడికొండలో పార్టీ గెలవాలనుకుంటే శ్రావణ్‌కు టికెట్ ఇవ్వాలని, తాడికొండ నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శ్రావణ్ స్థానాన్ని మార్చడంతో అక్కడి నేతలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు.

Aravind babu
Sravan
Thadikonda
KCR
Chandrababu
Guntur District
  • Loading...

More Telugu News