Sruthi Hassan: నేనే అబ్బాయినైతే.. తమన్నాను పెళ్లి చేసుకుని ఉండేదాన్ని: శ్రుతిహాసన్

  • తమన్నా చాలా మంచి అమ్మాయి
  • డేటింగ్‌కి తీసుకెళ్లేదాన్ని
  • అంత తేలిగ్గా వదులుకోను

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కి ఒకరంటే ఒకరికి పడదు అన్న రూమర్ ఉంది. కానీ మిల్కీబ్యూటీ తమన్నా, శ్రుతిహాసన్ స్నేహం అలా కాదు. ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. అవకాశం దొరికితే చాలు ఒకరినొకరు ప్రశంసలతో ముంచెత్తుకుంటూ ఉంటారు. తమన్నా చాలా మంచి అమ్మాయని.. తనను అంత తేలికగా వదులుకోనని అంటోంది శ్రుతిహాసన్.

ఓ కార్యక్రమంలో శ్రుతిని.. ‘ఒకవేళ మీరు అబ్బాయి అయి ఉంటే ఏ హీరోయిన్‌తో డేట్‌కు వెళ్లేవారు?’ అన్న ప్రశ్న అడిగారు. దీనికి తడుముకోకుండా.. 'ఇంకెవరు? తమన్నా' అంటూ ఠక్కున బదులిచ్చింది. అంతేకాదు.. ఇంకా శ్రుతి మాట్లాడుతూ.. ‘నేనే గనక అబ్బాయిని అయివుంటే.. తమన్నాను డేటింగ్‌కు తీసుకెళ్లేదాన్ని. అంతేకాదు పెళ్లి కూడా చేసుకునేదాన్ని. తమన్నా చాలా మంచి అమ్మాయి. తనను అంత తేలిగ్గా వదులుకోను’ అని చెప్పుకొచ్చింది.

Sruthi Hassan
Tamannah
Marriage
Dating
Friends
  • Loading...

More Telugu News