Telugudesam: సిటింగులను మార్చాలి.. లేకపోతే పరిస్థితి దారుణమే: జేసీ దివాకర్ రెడ్డి

  • కొందరి మాటలు నచ్చలేదు
  • సరైన ఆలోచనలు చేయట్లేదు 
  • పార్టీ మారే ఆలోచన లేదు

తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులపై అనుమానాలున్నాయని.. స్క్రీనింగ్ కమిటీలో కొందరు మాట్లాడుతున్న మాటలు అసలేమాత్రం తనకు నచ్చలేదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ స్క్రీనింగ్ కమిటీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కమిటీ సరైన ఆలోచనలు చేయడం లేదని విమర్శించారు. గుంతకల్లు, కళ్యాణదుర్గం, సింగనమల సిట్టింగులను మార్చాలన్నారు. లేకపోతే, అనంతపురం లోక్‌సభ స్థానంలో పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. తనకైతే పార్టీ మారే ఆలోచన లేదు కానీ.. పోటీ చేసే విషయాన్ని మాత్రం ఆలోచిస్తానని జేసీ స్పష్టం చేశారు.

Telugudesam
JC Diwakar Reddy
Screening Committee
Ananthapuram
Loksabha
  • Loading...

More Telugu News