YS Viveka: పెదనాన్నను ఎవరో దాడి చేసి చంపారు: వైఎస్ అవినాష్ సంచలన వ్యాఖ్యలు

  • ఇది సహజమరణం కాదు
  • తలపై బలమైన గాయాలున్నాయి
  •  లోతైన దర్యాప్తు జరపాలన్న అవినాష్ 

వైఎస్ వివేకానందరెడ్డిది సహజమరణం కాదని తమకు అనుమానాలు ఉన్నాయని, వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణం తమల్ని తీవ్రంగా కలచి వేసిందని వ్యాఖ్యానించిన అవినాష్, పెదనాన్న తలపై రెండు గాయాలు ఉన్నాయని గుర్తు చేశారు. బాత్ రూములో కాలుజారిపడితే తలకు వెనుకవైపు లేదా ముందు వైపు మాత్రమే గాయం అవుతుందని, రెండు వైపులా గాయం అయ్యే పరిస్థితే ఉండదని చెప్పారు. అవి పెద్ద గాయాలని, చేతిపైనా, ముఖంపైనా గాయాలున్నాయని ఆయన అన్నారు.

ఎవరో దాడి చేస్తేనే మరణించినట్టు స్పష్టంగా అర్ధమవుతోందని, తమకున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిందేనని అవినాష్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ వివేకా మృతిపై తక్షణం లోతైన దర్యాఫ్తును ప్రారంభించాలని కోరారు. కుట్రలో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిన్నంతా మైదుకూరులో ప్రచారం నిర్వహించిన ఆయన, నేడు మరణించి వుండటమేంటని, పూర్తి ఆరోగ్యంతో నిన్న కనిపించిన మనిషి, నేడు మరణించడం ఏంటని, ఈ అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.

YS Viveka
YS Avinash
Died
Death
Police
Enquiry
  • Loading...

More Telugu News