YS Vivekanandareddy: ఒక్కరన్నా ఉండుంటే... నిన్న రాత్రి వైఎస్ వివేకా ఇంట్లో ఏం జరిగింది?

  • అర్ధరాత్రి పులివెందులకు వచ్చిన వివేకా
  • నిన్న రాత్రి ఇంట్లో ఒంటరిగా వైఎస్ వివేకా
  • వాంతులు రావడంతో స్నానాల గదిలోకి
  • అక్కడే గుండెపోటుతో హఠాన్మరణం

వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి, ఈ తెల్లవారుజామున హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. గడచిన ఐదారు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వడపోత కార్యక్రమాల్లో జగన్ కు తోడుగా ఉన్న వివేకా, గత రాత్రే పులివెందులకు వచ్చారు. ఆయన వచ్చేటప్పటికి అర్ధరాత్రి అయింది. బాగా అలసిపోయి వచ్చిన ఆయన, వెంటనే నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజాము సమయంలో వాంతులు రావడంతో స్నానాల గదికి వెళ్లారు. స్నానాల గదిలోనే ఆయనకు గుండెపోటు రాగా కుప్పకూలారు.

ఆ సమయంలో ఇంట్లో వివేకానందరెడ్డి ఒంటరిగా ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్నానాల గదిలోనే ఆయన ప్రాణాలు పోయాయి. కాగా, వివేకా హఠాన్మరణం గురించి తెలుసుకున్న వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పులివెందులకు తరలివస్తున్నారు. ఆయన ఎలా చనిపోయారన్న విషయం తెలుసుకున్న తరువాత, ఇంట్లో కనీసం ఒక్కరైనా ఉండుంటే తమ నేత ప్రాణాలు దక్కేవని బోరున విలపిస్తున్నారు.

YS Vivekanandareddy
YSRCP
Pulivendula
  • Loading...

More Telugu News