CBI ex JD: టీడీపీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరిక ఇప్పట్లో లేనట్టే!

  • ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకోవాలని యోచన
  • తొలుత భీమిలి నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నట్టు వార్తలు
  • ఖండించిన లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిక వార్తలకు బ్రేక్ పడింది. ఆయన టీడీపీలో చేరి భీమిలి నుంచి బరిలోకి దిగబోతున్నారంటూ ఇటీవల వార్తలు హల్‌చల్ చేశాయి. లక్ష్మీనారాయణను హైదరాబాద్‌లో కలిసిన మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరికకు ఒప్పించినట్టు వార్తలొచ్చాయి. మీడియాలో ఈ వార్తలు హల్‌చల్ చేయడంతో లక్ష్మీనారాయణ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదన్నారు. అయితే, ఆయన చేరిక విషయాన్ని టీడీపీ ప్రస్తుతానికి పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల తర్వాతే లక్ష్మీనారాయణ చేరిక విషయం గురించి నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు సమాచారం.

CBI ex JD
Laxminarayana
Telugudesam
Bheemili
Andhra Pradesh
Visakhapatnam District
  • Loading...

More Telugu News