Chaina: రాహుల్ మీ ట్వీట్ కచ్చితంగా పాక్ వార్తల్లో నిలుస్తుంది: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

  • దేశమంతా విచారం వ్యక్తం చేస్తోంది
  • రాహుల్ మాత్రం పండగ మూడ్‌లో ఉన్నారు
  • రాహుల్ మీకేమైంది?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా రాహుల్.. ‘బలహీనమైన మోదీ జిన్‌పింగ్‌కి భయపడుతున్నారు. భారత ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంటే.. మోదీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. చైనాతో నమో దౌత్య సంబంధం ఎలాంటిదంటే.. 1. గుజరాత్‌లో షితో కలిసి పర్యటిస్తారు. 2. ఢిల్లీలో షిని కౌగిలించుకుంటారు. 3. చైనాలో జిన్‌పింగ్‌ ముందు తలవంచుతారు’ అని రాహుల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన రవిశంకర్ దేశ పరిస్థితులు రాహుల్‌‌కి పట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చైనా అనుసరిస్తున్న విధానాల పట్ల దేశమంతా విచారం వ్యక్తం చేస్తుంటే రాహుల్‌ గాంధీ మాత్రం పండగ మూడ్‌లో ఉన్నారు. రాహుల్‌గాంధీ మీకేమైంది? మీ ట్వీట్‌ కచ్చితంగా పాకిస్థాన్‌ వార్తల్లో నిలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

Chaina
Rahul Gandhi
Ravishankar Prasad
Gujarathi
XI
Narendra Modi
Delhi
  • Loading...

More Telugu News