Magunta Srinivasula Reddy: టీడీపీకి మాగుంట రాజీనామా.. చంద్రబాబుపై ప్రశంసలు

  • వైసీపీలో చేరనున్నట్టు ప్రకటించిన మాగుంట
  • వైఎస్‌తో ఉన్న అనుబంధంతోనే వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటన
  • చంద్రబాబు అన్ని రకాలుగా సహకరించారని వెల్లడి

ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో సమావేశానంతరం వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే టీడీపీని వీడిన నేతలంతా ఆ పార్టీతో పాటు చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తుంటే.. మాగుంట మాత్రం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. వైఎస్‌తో ఉన్న అనుబంధంతోనే వైసీపీలో చేరుతున్నానని ఆయన తెలిపారు. తనకు చంద్రబాబుతో 37 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. తనకు ఆయన ఎంతో సహకరించారని.. తాను ఎంపీగా ఓడినా కూడా ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం ఇచ్చారని మాగుంట కొనియాడారు.

Magunta Srinivasula Reddy
Chandrababu
YSRCP
YS Rajasekhar Reddy
Telugudesam
  • Loading...

More Telugu News