dinakaran: జైలులో శశికళతో భేటీ అయిన దినకరన్

  • పరప్పణ అగ్రహర జైలులో శశికళను కలిసిన దినకరన్
  • రెండాకుల గుర్తు పిటిషన్ పై చర్చ
  • లోక్ సభ ఎన్నికలపై కూడా చర్చ

అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళను ఆమె మేనల్లుడు, ఎమ్మెల్యే దినకరన్ కలిశారు. లోక్ సభ ఎన్నికలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. అన్నాడీఎంకేకు కేటాయించిన రెండాకుల గుర్తుపై కూడా వీరు చర్చించారు. ఈ గుర్తుపై వేసిన పిటిషన్ ను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. అన్నాడీఎంకేకు రెండాకుల గుర్తును ఎలక్షన్ కమిషన్ కేటాయించడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుపై... సుప్రీంకోర్టులో దినకరన్ అప్పీల్ చేశారు.

dinakaran
sashikala
meeting
  • Loading...

More Telugu News