Konathala Ramakrishna: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి కొణతాల!

  • టీడీపీలో చేరనున్నారని ప్రచారం
  • అనుచరులతో మాట్లాడాక మారిన నిర్ణయం
  • రేపు జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న కొణతాల

మాజీ మంత్రి కొణతాల రామక‌ష్ణ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అనుచరులతో సమావేశానంతరం ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. రేపు ఉదయం లోటస్‌పాండ్‌కు వెళ్లి వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. కొణతాల టీడీపీలో చేరనున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన అనూహ్యంగా వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే ఆయనకు రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న దాడి వీరభద్రరావు కూడా ఇటీవల వైసీపీలో చేరారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. దాడి మొదట టీడీపీలో చేరాలని భావించారట కానీ కొణతాల టీడీపీలో చేరతారని ప్రచారం జరగడంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకుని వైసీపీలో జాయిన్ అయ్యారని సమాచారం. ప్రస్తుతం కొణతాల కూడా వైసీపీలో చేరనుండటంతో విశాఖ జిల్లాలో మరింత ఆసక్తికర పరిస్థితి నెలకొననుంది.

Konathala Ramakrishna
Dadi Veerbhadra Rao
Jagan
Lotus Pond
YSRCP
  • Loading...

More Telugu News