India: ​ కాగ్ నివేదికలో పొరబాటు జరిగిందన్న అటార్నీ జనరల్.. రాఫెల్ స్కాం తీర్పు రిజర్వులో పెట్టిన సుప్రీం

  • కాగ్ రిపోర్టులో తొలి 3 పేజీలు మిస్సయ్యాయి
  • ఆ పేజీలు రికార్డుల్లో చేర్చుతాం
  • కేంద్రం తరఫున అనుమతి కోరిన ఏజీ

రాఫెల్ కేసులో రివ్యూ పిటిషన్లపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రాఫెల్ ఒప్పందం గురించి కోర్టుకు సమర్పించిన కాగ్ నివేదికలో పొరబాటు జరిగిందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వెల్లడించారు. కాగ్ నివేదికలోని మొదటి మూడు పేజీలు మిస్సయ్యాయని న్యాయస్థానానికి తెలిపారు. మిస్సయిన పేజీలను రికార్డుల్లో చేర్చేందుకు కేంద్రానికి అనుమతి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. అంతేకాకుండా, లీకైన రాఫెల్ పత్రాలను రికార్డుల నుంచి తొలగించాలంటూ విజ్ఞప్తి చేశారు. దేశభద్రతను దృష్టిలో ఉంచుకుని వాటిని గోప్యతా పత్రాలుగా పరిగణించాలని కోరారు.

అయితే, రాఫెల్ స్కాంలో రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన వ్యక్తుల తరపు న్యాయవాది ఇందుకు అభ్యంతరం చెప్పారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు రాఫెల్ అంశంపై తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ప్రశాంత్ భూషణ్ తదితరులు పిటిషన్ లో భాగంగా అందజేసిన డాక్యుమెంట్లను పరిశీలించేందుకు కొంత సమయం అవసరమంటూ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అంతకుముందు, ఈ పత్రాలు ఎంతో గోప్యంగా ఉంచాల్సినవని, ఇలా అనుమతి లేకుండా న్యాయస్థానానికి సమర్పించడం సరికాదని ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. దాంతో, పిటిషనర్లు కూడా దీటుగా స్పందించి, ప్రతి అంశాన్ని జాతీయ భద్రత పేరుతో తొక్కిపెట్టడం కుదరదని వాదించారు. 

  • Loading...

More Telugu News