EVMS: ఓటరు జాబితాలో చిత్ర విచిత్రాలు.. ఇద్దరి వ్యక్తుల వయసు 265 ఏళ్లు, మరొకరి వయసు 144 ఏళ్లు!

  • తప్పుల తడకగా పంజాబ్‌లోని లుధియానా ఓటర్ల జాబితా
  • వేలాదిమంది శతాధిక వృద్ధులు
  • 118 ఏళ్లు ఉన్నవారు ఏకంగా 273 మంది

ప్రస్తుతం దేశంలో ఓటర్ జాబితాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని ఓ పార్టీ.. జాబితా తప్పుల తడకగా ఉందని మరో పార్టీ ఇలా పరస్పరం బురద జల్లుకుంటున్నాయి. ఇక, దేవుళ్లకు ఓట్లు ఉండడం, చనిపోయిన వారికీ ఓటుండడం.. ఇలాంటి చిత్రవిచిత్రాలు చాలానే ఉంటాయి. అయితే, పంజాబ్‌లోని లుధియానాలో మాత్రం ఇంతకుమించిన విత్రం ఒకటి కనిపించింది.

లుధియానా తూర్పు నియోజకవర్గంలో ఓ పురుషుడు, మరో మహిళ వయసు ఏకంగా 265 ఏళ్లట. ఓ వ్యక్తి వయసు 144 ఏళ్లట. అంతేకాదు, 118 ఏళ్లున్న వ్యక్తులు ఏకంగా 273 మంది ఉన్నారు. ఇలా మొత్తం 863 మందికిపైగా శతాధిక వృద్ధులు ఓటర్ల జాబితాలో పేరు సంపాదించుకున్నారు. ఓటర్ల జాబితాలో 5,916 మంది ఓటర్లు వందేళ్లకు పైన వయసున్న వారు ఉన్నారని, సాంకేతిక కారణాల వల్లే ఈ తప్పిదం జరిగిందని పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) ఎస్‌కే రాజు తెలిపారు. ఎన్నికల్లోపు తప్పులను సరిదిద్దుతామని పేర్కొన్నారు.

EVMS
Election commission
Punjab
Ludhiana
Voter list
  • Loading...

More Telugu News