KCR: 'రాష్ట్రం వచ్చుడో... నేను చచ్చుడో'... కేసీఆర్ బయోపిక్ 'ఉద్యమ సింహం' ట్రయిలర్!

  • మార్చి 29న విడుదల కానున్న సినిమా
  • కేసీఆర్ ఉద్యమ ప్రస్థానంపై చిత్రం
  • ఆకట్టుకుంటున్న డైలాగులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఉద్యమ సింహం' ట్రయిలర్ విడుదలైంది. నటరాజన్, పీఆర్ విఠల్ బాబు, సూర్యలు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహించగా, దిలీప్ బండారి సంగీతాన్ని సమకూర్చారు. చిత్రాన్ని పద్మనాయకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మించారు.

మార్చి 29న విడుదల కానున్న ఈ సినిమాలో కేసీఆర్ ఉద్యమ ప్రస్థానాన్ని చూపించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన పడ్డ తమన, ఎదుర్కొన్న అవమానాలు, చేసిన ఆమరణ దీక్ష తదితరాంశాలను చిత్రంలో ప్రస్తావించినట్టు ట్రయిలర్ చెబుతోంది. "కత్తి పట్టకుండా యుద్ధం చేయనీకి పోతుండాం. రాష్ట్రం వచ్చుడో... నేను చచ్చుడో", "రాష్ట్రం ఇస్తరా? చస్తరా?" వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ట్రయిలర్ ను మీరూ చూడవచ్చు.

KCR
Biopic
Udyamasimham
Trailer
  • Error fetching data: Network response was not ok

More Telugu News