Nellore District: టీడీపీకి సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి రాజీనామా.. ఫ్యాక్స్‌లో చంద్రబాబుకు లేఖ

  • గత ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు
  • బీద రవిచంద్ర తీరు నచ్చడం లేదు
  • నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయా

నెల్లూరుకు చెందిన సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి  టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను పంపారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని చెప్పిన అధిష్ఠానం ఆ హామీని నిలబెట్టుకోలేకపోయిందని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరకాలంగా పార్టీనే నమ్ముకుని ఉన్నానని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో చివరి వరకు టికెట్ తనకే ఇస్తానని చెప్పి చివర్లో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి ఇచ్చారన్నారు.

ఆ తర్వాత ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైనట్టు చెప్పారు. దీనికితోడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర తీరు కూడా తనకు నచ్చడం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్న పెళ్లకూరు.. తనను నమ్ముకుని తనతో పాటు నడిచిన కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయానని, తనను క్షమించాలని వేడుకున్నారు.

Nellore District
Telugudesam
Pellakuru srinivasulu reddy
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News