Chandrababu: జగన్ ఫ్యాన్ కంటే హెలికాప్టర్ ఫ్యానే పవర్ ఫుల్.. చంద్రబాబు కామెడీ
- ఆ గుర్తు ఇచ్చినందుకు జగన్ గింజుకుంటున్నాడు
- మామూలు ఫ్యాన్ కంటే హెలికాప్ట్ ఫ్యానే పెద్దది
- రెండూ ఫ్యాన్ గుర్తులేనంటూ చంద్రబాబు చమత్కారం
ఏపీలో ఈసారి రెండు ఫ్యాన్ లు వస్తున్నాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చమత్కరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి టీడీపీ, ప్రజాశాంతి పార్టీ మధ్యే పోటీ ఉంటుందన్న కేఏ పాల్ వ్యాఖ్యలను ఓ విలేకరి ఈ సందర్భంగా ప్రస్తావించగా, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలతో అందరినీ నవ్వించారు.
జగన్ ఫ్యాన్ కంటే హెలికాప్టర్ ఫ్యానే పవర్ ఫుల్ అంటూ వ్యాఖ్యానించారు. "జగన్ మోహన్ రెడ్డి గింజుకుంటున్నాడు. అది కూడా ఫ్యానే, నాది కూడా ఫ్యానే అని తెగ బాధపడిపోతున్నాడు. డెఫినెట్ గా పవర్ ఫుల్ ఫ్యాన్ వచ్చేసి హెలికాప్టర్ ఫ్యానే. జగన్ ఫ్యాన్ కు రేంజ్ తక్కువ. ఆ ఫ్యాన్ కు పెద్ద రేంజ్ ఉంటుంది" అంటూ మీడియా సమావేశంలో నవ్వులు పూయించారు.