Chandrababu: నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో జగన్ కు బాగా తెలుసు.. ఎవరికీ రాని ఆలోచనలు ఆయనకే వస్తాయి: చంద్రబాబు

  • జగన్, మోదీ, కేసీఆర్ లపై బాబు విమర్శలు
  • మోదీ, కేసీఆర్ లకు జగన్ బానిస
  • కేసులకు భయపడే తలొగ్గాడు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి జగన్ ను లక్ష్యంగా చేసుకుని మోదీ, కేసీఆర్ లను సైతం విడిచిపెట్టకుండా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో జగన్ కు బాగా తెలుసని అన్నారు. చట్ట వ్యతిరేకంగా ఎన్ని నేరాలు ఉన్నాయో అన్నీ చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు. వ్యాపారాల్లో చేసినవి చాలకుండా ఇప్పుడు రాజకీయాల్లోనూ కుట్రలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు.

ఫారం-7 ఇవ్వడం, లక్షలాది ఓట్లు తీసేయడం దారుణమని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 9 లక్షల ఓట్ల తొలగింపు దరఖాస్తులు ఇచ్చారని చెప్పారు. జగన్ ను బానిసను చేసుకుని మోదీ, కేసీఆర్ లు అరాచకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరాలు తప్పించుకోవడానికి జగన్ కు మోదీ, కేసీఆర్ దొరికారని ఆరోపించారు. నేరాలు చేయడంలో గ్రాండ్ మాస్టర్ అయిన జగన్.. కేసులకు భయపడే మోదీ, కేసీఆర్ లకు తలొగ్గాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

 "మోదీ, కేసీఆర్ లతో కలిసి కుట్రలు పన్నారు. పాయింట్ టు పాయింట్ ఏం చేయాలో రాసుకున్నారు. చివరికి డేటా దొంగిలించే స్థాయికి దిగజారిపోయారు. డేటా చౌర్యం కేసులో తెలంగాణ పోలీసులు ఆ పాయింట్లనే ఫాలో అవుతున్నారు. ఎవరికీ రాని ఆలోచనలు జగన్ కు వస్తాయి. ఆయన నేరాల్లో గ్రాండ్ మాస్టర్. చెస్ లో అందరినీ ఓడించిన వాళ్లకు ఎలా అయితే గ్రాండ్ మాస్టర్ రేటింగ్ ఇస్తారో జగన్ నేరాల్లో ఆ విధంగా గ్రాండ్ మాస్టర్ అయ్యారు. ఆ రోజు రాజధాని అమరావతిలో చెరుకు తోట తగలబెట్టించి మాపైనే నింద వేసిన దగ్గర్నుంచి నేడు డేటా చౌర్యం వరకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు" అంటూ తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు.

  • Loading...

More Telugu News