Vamsikrishna Srinivas: పార్టీని వీడే యోచనలో విశాఖ వైసీపీ నేత.. నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ!

  • సమన్వయకర్తగా విస్తృత పర్యటన
  • పార్టీ కోసం శ్రమించానంటున్న వంశీకృష్ణ
  • సీటు విషయంలో స్పష్టత లేకపోవడంతో మనస్తాపం

విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఆ పార్టీని వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సీటు విషయంలో పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆయన మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. వంశీకృష్ణను వైసీపీ అధినేత సమన్వయకర్తగా నియమించినప్పటి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు. పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన తనకు పార్టీ టికెట్ విషయంలో స్పష్టతను ఇవ్వకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ తన నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఏం నిర్ణయం తీసుకోనున్నారో వేచి చూడాలి.

Vamsikrishna Srinivas
YSRCP
Visakha
Jagan
  • Loading...

More Telugu News