Kanna Lakshminarayana: ఇలా మాట్లాడేది ఎవరో తెలుసా?: చంద్రబాబుపై కన్నా సెటైర్

  • ప్రజలకు సమాధానం చెప్పడు
  • కేంద్రానికి లెక్కలు చెప్పడు
  • ఆయనది కుప్పం కాబట్టి: కన్నా సెటైర్లు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని టార్గెట్ చేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సెటైర్లు వేశారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టిన ఆయన, "ఇలా మాట్లాడేది ఎవరో తెలుసా?" అని ఓ ప్రశ్నను సంధించారు. "ప్రజలకి సమాధానం చెప్పం.. కేంద్రానికి లెక్కలు చెప్పం.. మీడియాకి నిజాలు చెప్పం.. ఐనా నన్ను నమ్మండి. ఎందుకంటే నాది కుప్పం..! ఇలా  మాట్లాడే ఆయన ఎవరో తెలుసా? హింట్ - వెన్నుపోటుకి వారసుడు.. యూ- టర్న్ కి దగ్గరి చుట్టం" అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు కన్నా ఓ ఊసరవెల్లి పిక్ ను కూడా ఉంచారు. కన్నా ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News