Lotuspond: లోటస్ పాండ్ లో బాపట్ల వైకాపా కార్యకర్తల నిరసన!

  • బాపట్ల టికెట్ కోన రఘుపతికి
  • అదే స్థానాన్ని ఆశిస్తున్న చీరాల గోవర్ధన్ రెడ్డి
  • ఆగ్రహంతో నిరసనకు దిగిన గోవర్ధన్ అనుచరులు

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోటస్ పాండ్ లో ఉన్న తన నివాసంలో అభ్యర్థుల వడపోతపై జగన్ తలమునకలై ఉన్నవేళ, ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఆశావహుల వెంట వచ్చిన కార్యకర్తలు 'రావాలి జగన్ - పోవాలి కోన రఘుపతి' అంటూ భారీ ఎత్తున నినాదాలు చేస్తుండటంతో ఏం జరుగుతుందోనన్న విషయమై కాసేపు అయోమయం నెలకొంది.

 బాపట్ల టికెట్ ను ఆశిస్తున్న చీరాల గోవర్ధన్ రెడ్డి, తన అనుచరులతో కలిసి జగన్ తో టికెట్ విషయమై మాట్లాడేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో బాపట్ల స్థానాన్ని కోన రఘుపతికి ఇచ్చినట్టుగా సమాచారం ఆయనకు అందింది. దీంతో ఆగ్రహానికి గురైన గోవర్ధన్ రెడ్డి అనుచరులు నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది పడాల్సి వచ్చింది.

Lotuspond
YSRCP
Bapatla
Kona Raghupati
  • Loading...

More Telugu News