Andhra Pradesh: నామినేషన్ల దాఖలుకు శుభఘడియలు ఇవేనట!

  • 25తో ముగియనున్న నామినేషన్ల ఘట్టం
  • మంచి ముహూర్తాల కోసం వెతుతుకున్న అభ్యర్థులు
  • జన్మనక్షత్రం, రాశి ఆధారంగా శుభసమయం

ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. ఈ నెల 25లోగా నామినేషన్ల ఘట్టం పరిసమాప్తం అవుతుంది. ఇక టికెట్ ఖరారైనవారితో పాటు, తమకే టికెట్ లభిస్తుందన్న గంపెడాశతో ఉన్న ఆశావహులు, నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సిద్ధాంతులను, పురోహితులను ఆశ్రయిస్తూ మంచి ముహూర్తాల కోసం వెతుకుతున్నారు. తమతమ జన్మనక్షత్రం, రాశి ఆధారంగా శుభ సమయాన్ని చెప్పించుకుంటున్నారు.

ఇక ఈ నెల 18 నుంచి 25 మధ్య ఉన్న మంచి ముహూర్తాలను పరిశీలిస్తే, 18వ తేదీ సోమవారం ఉదయం 11 నుంచి 11.30, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శుభసమయాలున్నాయి. ఇక 19వ తేదీ మంగళవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు, 20 వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1.30 నుంచి 3 వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు శుభ ఘడియలు ఉన్నాయని చెబుతున్నారు.

 21వ తేదీ గురువారం మధ్యాహ్నం 1.30 నుంచి 2.45 వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు, 22వ తేదీ శుక్రవారం ఉదయం 10.15 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 2.45 వరకు, 23వ తేదీ శనివారం ఉదయం 10.30 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 5 మధ్య మంచి ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. 24వ తేదీ ఆదివారం కావడంతో, ఆ రోజు నామినేషన్లను స్వీకరించరు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన 25వ తేదీ సోమవారం, ఉదయం 10 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 2 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయట.

  • Loading...

More Telugu News