Jagan: వైసీపీకి కొత్త తలనొప్పి.. బాబ్జీ చేరికను వ్యతిరేకిస్తున్న నేతలు.. వ్యతిరేక నినాదాలు

  • జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న బాబ్జీ
  • వ్యతిరేకిస్తున్న గున్నం నాగబాబు
  • బాబ్జీకి టికెట్ ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని ఆందోళన

వైసీపీలోకి వలసల వెల్లువతో ఆ పార్టీ అధిష్ఠానం ఉబ్బితబ్బిబ్బవుతున్నప్పటికీ దాంతో పాటే కొత్త తలనొప్పులు కూడా మొదలవుతున్నాయి. పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్ నారాయణమూర్తి (బాబ్జీ) మంగళవారం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఆయన రాకను వ్యతిరేకిస్తున్న ఓ వర్గం ఆందోళనకు దిగింది.

భీమవరం వైసీపీ కన్వీనర్ గున్నం నాగబాబు తన అనుచరులతో కలిసి కనుముూరి రామకృష్ణంరాజు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. బాబ్జీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీలోకి ఆయన రాకను వ్యతిరేకించారు. పార్టీకి మొదటి నుంచి తాము సేవ చేస్తున్నామని, తమను కాదని బాబ్జీకి అసెంబ్లీ సీటు కేటాయిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా, పార్టీలో చేరిన బాబ్జీ భీమవరం టికెట్ కావాలని జగన్‌ను కోరినట్టు తెలుస్తోంది.  

Jagan
Babji
YSRCP
West Godavari District
Andhra Pradesh
  • Loading...

More Telugu News