YSRCP: ​ స్థానిక నేతలపై నమ్మకం లేక ఎక్కడ్నించో తెచ్చి పోటీకి నిలబెట్టారు: కొడాలి నాని సెటైర్

  • ఎవరొచ్చినా‌ ‍గుడివాడలో గెలుపు నాదే
  • నా ఓటమి కోసం టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది
  • వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

గుడివాడ శాసనసభ్యుడు, వైసీపీ నేత కొడాలి నాని టీడీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడివాడ పార్టీ ఆఫీసులో వేడుకలు నిర్వహించగా, కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనను ఓడించడానికి టీడీపీ చేయని ప్రయత్నమంటూ లేదని ఎద్దేవా చేశారు.

డబ్బు, మంది బలాన్ని ప్రయోగించి తనను పరాజయం పాల్జేసేందుకు తీవ్రంగా పాటుపడుతున్నారని ఆరోపించారు. అందుకే, స్థానిక నేతలపై నమ్మకం లేక ఎక్కడ్నించో అభ్యర్థిని తీసుకువచ్చి గుడివాడలో పోటీచేయిస్తున్నారంటూ సెటైర్ వేశారు నాని. ఎవరొచ్చినా, ఏం చేసినా గుడివాడలో తన గెలుపును మాత్రం అడ్డుకోలేరంటూ స్పష్టం చేశారు. గుడివాడలో నానిపై పోటీగా టీడీపీ దేవినేని అవినాష్ ను బరిలో దింపిన సంగతి తెలిసిందే. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడైన దేవినేని అవినాష్ స్థానికేతరుడు కావడంతో కొడాలి నాని పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News