Telugudesam: జగన్, సాక్షి పత్రికపై ఈసీకి ఫిర్యాదు చేసిన దివ్యవాణి
- టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు
- సాక్షి ప్రతులు ఫ్రీగా పంచుతున్నారు
- మండిపడిన టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి
ఏపీలో రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలు ప్రకటించడంతో రాజకీయ పక్షాలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కు సంబంధించిన సాక్షి పత్రికను వీధుల్లో, పార్కుల్లో ఉచితంగా పంచుతున్నారంటూ టీడీపీ మండిపడుతోంది.
ఈ మేరకు రూ.60 లక్షల ఖర్చును జగన్ ఖాతాలో రాయాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. సాక్షి పత్రికలో రిటైర్డ్ సీఎస్ అజయ్ కల్లంతో వ్యాసం రాయించి దుష్ప్రచారానికి పాల్పడుతున్నాంటూ దివ్యవాణి ఆరోపించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఈసీని కోరారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలిసిన సమయంలో దివ్యవాణి వెంట బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య కూడా ఉన్నారు.