vangaveeti: వంగవీటి రాధా ఎక్కడి నుంచి పోటీ చేసినా వ్యతిరేకిస్తాం: ఏపీ కాపునాడు

  • రాధాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం
  • పవన్ మద్దతు ఇవ్వడం వల్లే గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశాం
  • రంగా హత్యలో టీడీపీ పాత్ర లేదనే వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలోకి చేరనున్న సంగతి తెలిసిందే. అయితే, టీడీపీలో ఆయన చేరికను రాష్ట్ర కాపునాడు వ్యతిరేకిస్తోంది. టీడీపీ తరపున ఎక్కడి నుంచి పోటీ చేసినా రాధాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు శ్రీను తెలిపారు. విజయవాడలో మీడియాతో శ్రీను మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ మద్దతు పలికినందుకే గత ఎన్నికల్లో కాపులు టీడీపీకి ఓటు వేశారని చెప్పారు. వంగవీటి రంగా హత్యలో టీడీపీ పాత్ర లేదని రాధా వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామని... ఆ వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

vangaveeti
radhakrishna
ranga
kapunadu
Telugudesam
  • Loading...

More Telugu News