konda visweshwar reddy: దీక్షకు దిగిన చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్

  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతోందంటూ కొండా దీక్ష
  • దీక్షను భగ్నం చేసి, అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ను వీడిన కొండా

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటూ వికారాబాద్ లో ఆయన ఈరోజు దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో, ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు... ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

దీక్ష సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. గత ఐదేళ్లలో జిల్లాకు ఒక కొత్త ఉద్యోగం కూడా రాలేదని మండిపడ్డారు. ఒక్క ఎకరానికి కూడా సాగు నీటిని ఇవ్వలేకపోయారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

konda visweshwar reddy
chevella
mp
arrest
  • Loading...

More Telugu News