India: 2019 సార్వత్రిక ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?
- సార్వత్రిక ఎన్నికల వ్వయం 7 బిలియన్ డాలర్లు
- అమెరికా కంటే మన ఖర్చే ఎక్కువ
- అంచనా వేసిన సీఎంఎస్ సంస్థ
జనాభా పరంగా పెద్ద దేశాల్లో ఒకటిగా పేరుగాంచిన భారత్ లో ఎన్నికలు అంటే అత్యంత వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. కోట్లమంది ఓటర్లు, లక్షల సంఖ్యలో పోలింగ్ స్టేషన్లు, ఎన్నికల అధికారులు, ఇతర సిబ్బంది, ఈవీఎంలు, మౌలిక సదుపాయాలు, రవాణా... ఇలా అనేక అంశాలు ఎన్నికలతో ముడిపడి ఉంటాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత వ్యయభరిత ఎన్నికల ప్రక్రియగా 2019 సార్వత్రిక ఎన్నికలు గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఏప్రిల్ 11న తొలి దశ పోలింగ్ తో మొదలై మొత్తం 7 విడతల్లో జరిగే ఈ ఎన్నికల ప్రక్రియ మే 23న ఫలితాల వెల్లడితో ముగియనుంది. మొత్తమ్మీద మన సార్వత్రిక ఎన్నికల కోసం ఈసారి 50 వేల కోట్లరూపాయలు ఖర్చు అవుతుందని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ (సీఎంఎస్) అంచనా వేసింది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 6.5 బిలియన్ డాలర్లు వ్యయం అయినట్టు గుర్తించారు. 2014లో భారత్ లో జరిగిన ఎన్నికలకు రూ.34 వేల కోట్లు ఖర్చయింది. ప్రస్తుత ఎన్నికల్లో వ్యయం మరో 40 శాతం పెరిగినట్టు సీఎంఎస్ వర్గాలు తెలిపాయి.