bhuma akhilapriya: మా ఛాలెంజ్ ఇదే: భూమా అఖిలప్రియ

  • మాకు టికెట్ రాకుండా చాలా మంది ప్రయత్నించారు
  • బ్రహ్మానందరెడ్డికి టికెట్ రాదని వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు
  • ఉప ఎన్నికల కంటే ఒక్క ఓటు కూడా బ్రహ్మానందరెడ్డికి తగ్గదు

తమకు టికెట్ రాకుండా అడ్డుకోవడానికి చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. తనను, తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచి మళ్లీ టికెట్లు ఇచ్చారని చెప్పారు. బ్రహ్మానందరెడ్డికి నంద్యాల టికెట్ రాదని వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని మండిపడ్డారు. ఉపఎన్నికల మెజార్టీ కంటే ఒక్క ఓటు కూడా బ్రహ్మానందరెడ్డికి తగ్గదని... ఇదే తమ ఛాలెంజ్ అని అన్నారు. భూమా నాగిరెడ్డి రెండో వర్ధంతిని ఈరోజు నంద్యాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

తన తండ్రి చావుకు కారణమైన వారిని గత ఎన్నికల్లో ఓడించి.. జిల్లాలో ఉండకుండా చేయాలని ఇంతకు ముందు చెప్పానని అఖిలప్రియ చెప్పారు. ఇప్పుడు మళ్లీ వాళ్లను ఓడించి, రాష్ట్రంలోనే లేకుండా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

bhuma akhilapriya
brahmananda reddy
nadyal
Telugudesam
challenge
  • Loading...

More Telugu News