yarapatinene: గురజాల టీడీపీ ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక

  • అవినీతిపరులు, భూకబ్జాదారులు పద్ధతి మార్చుకోవాలి
  • దాచేపల్లిలో మావోయిస్టు లేఖల దర్శనం
  • రీజనల్ కమిటీ పేరుతో హెచ్చరికలు

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి కలకలం రేపారు. అవినీతిపరులు, భూకబ్జాదారులు తమ పద్ధతిని మార్చుకోవాలంటూ లేఖ ద్వారా హెచ్చరించారు. గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, దాచేపల్లి ఎంపీపీ నవకుమార్, టీడీపీ నేతలు తంగెళ్ల శ్రీనివాసరావు, మునగ నిమ్మయ్య, పగడాల భాస్కర్ లకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు దాచేపల్లి మోడర్న్ స్కూల్ వద్ద లేఖలు కనిపించాయి. గతంలో కూడా పల్నాడులో పలుమార్లు ఇలాంటి లేఖలే దర్శనమిచ్చాయి. పల్నాడు మావోయిస్టు రీజనల్ కమిటీ పేరుతో ఈ లేఖలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఈ లేఖలు చర్చనీయాంశంగా మారాయి.

yarapatinene
maoist
warning
gurajala
Telugudesam
  • Loading...

More Telugu News