ysrcp: వైసీపీలో సీట్ల రచ్చ.. లోటస్ పాండ్ వద్ద ఉరవకొండ, బాపట్ల కార్యకర్తల ఆందోళన

  • ఉరవకొండ టికెట్ ను విశ్వేశ్వర్ రెడ్డికి కేటాయించిన జగన్
  • ఆందోళనకు దిగిన శివరామిరెడ్డి వర్గీయులు
  • విశ్వేశ్వరరెడ్డిని ఓడిస్తామంటూ హెచ్చరిక

వైసీపీలో సీట్ల లొల్లి తీవ్రతరమవుతోంది. హైదరాబాదులోని జగన్ నివాసం లోటస్ పాండ్ వద్ద ఉరవకొండ, బాపట్ల వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉరవకొండ నియోజకవర్గం టికెట్ ను శివరామిరెడ్డికి కాకుండా విశ్వేశ్వరరెడ్డికి కేటాయించడంపై ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నాన్ని వైయస్ వివేకానందరెడ్డి, విజయసాయిరెడ్డి చేస్తున్నప్పటికీ... వారు శాంతించడం లేదు. విశ్వేశ్వరరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించితీరుతామని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు బాపట్ల టికెట్ విషయంలో కూడా వివాదం నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతిని వ్యతిరేకిస్తున్న వర్గం కూడా ఆందోళనకు దిగింది. 'రావాలి జగన్.. వెళ్లాలి కోన' అంటూ వారు నినాదాలు చేస్తున్నారు. వైసీపీలో పలు నియోజకవర్గాల్లో ఇద్దరు నుంచి ముగ్గురు టికెట్ కోసం యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరినీ సంతృప్తి పరచడం పార్టీ హైకమాండ్ కు కత్తి మీద సాములా మారింది. 

ysrcp
uravakonda
visweshwar reddy
sivarami reddy
bapatla
ticket
jagan
  • Loading...

More Telugu News