ram: తమిళ హిట్ మూవీ రీమేక్ లో రామ్

  • రామ్ తాజా చిత్రంగా 'ఇస్మార్ట్ శంకర్'
  • తదుపరి చిత్రానికి సన్నాహాలు
  •  త్వరలోనే పూర్తి వివరాలు

ఈ మధ్య వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న రామ్, కథలపై మరింత శ్రద్ధ పెట్టాడు. సాధ్యమైనంత త్వరగా ఒకటి రెండు హిట్లు తన ఖాతాలో వేసుకోవాలనే ఆలోచనలో వున్నాడు. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడనేది తాజా సమాచారం. ఇది రీసెంట్ గా తమిళంలో భారీ విజయాన్ని సాధించిన 'థడమ్' సినిమాకి రీమేక్.

 చాలా తక్కువ బడ్జెట్లో తమిళంలో అరుణ్ విజయ్ చేసిన ఈ సినిమా అక్కడ 15 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం గట్టిపోటీ ఏర్పడింది. చివరికి తెలుగు రీమేక్ హక్కులను స్రవంతి రవికిశోర్ దక్కించుకోగా, ఈ సినిమా నిర్మాణంలో ఠాగూర్ మధు కూడా ఒక భాగస్వామిగా ఉండనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ram
  • Loading...

More Telugu News