Pawan Kalyan: ఆ రెండు స్థానాల్లో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు?

  • తెరపైకి పిఠాపురం, గాజువాక నియోజకవర్గాలు
  • ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం
  • అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తారని తొలుత ప్రచారం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. రాజమండ్రి, అమలాపురం ఎంపీ స్థానాలకు నిన్న అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. అనంతపురం జిల్లా నుంచి ఆయన పోటీ చేస్తారనే వార్తలు తొలుత వినిపించాయి. ప్రస్తుతం పిఠాపురం లేదా గాజువాక నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేస్తారనే చర్చ జనసేనలో సాగుతోంది. ఈ రెండు స్థానాల్లో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలో... ఒకటి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని జనసేన వర్గీయులు చెబుతున్నారు. 

Pawan Kalyan
janasena
constituency
pithapuram
gajuvaka
  • Loading...

More Telugu News