Uttar Pradesh: వీడియో చూస్తూ స్వీయ ప్రసవ ప్రయత్నం... కన్నుమూసిన అవివాహిత!

  • యూపీలోని గోరఖ్ పూర్ లో ఘటన
  • పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతి
  • ఎవరికీ చెప్పకుండా గర్భాన్ని దాచిన అవివాహిత

ఎవరో మోసం చేస్తే, గర్భవతి అయిన అవివాహిత, యూట్యూబ్ లో వీడియోను చూస్తూ, స్వీయ ప్రసవానికి ప్రయత్నించి, తీవ్ర రక్తస్రావంతో కన్నుమూసిన ఘటన యూపీలోని గోరఖ్ పూర్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, బహ్రయిచ్ కు చెందిన ఓ యువతి (25) గత నాలుగేళ్లుగా గోరఖ్ పూర్ లో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది.

 ఈ క్రమంలో ఎవరితోనో పెట్టుకున్న పరిచయం హద్దులు దాటగా, గర్భం దాల్చింది. విషయాన్ని ఎవరికీ చెప్పని ఆమె, తన గదిలోనే వీడియో చూస్తూ, ప్రసవానికి ప్రయత్నించి మరణించింది. ఆ గది నుంచి రక్తం వస్తుండటాన్ని చూసిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూశారు. రక్తం మడుగులో పసికందు, పక్కనే యువతి మృతదేహాలు కనిపించడంతో, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆమె ఎవరి కారణంగా గర్భం దాల్చిందన్న విషయం ఇంకా తేలలేదని, యువతి కుటుంబీకులు కూడా ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.

Uttar Pradesh
Un Married Lady
Pregnent
Video
You Tube
Delivary
  • Loading...

More Telugu News