jagan: మాగుంటకు ఎంపీ టికెట్.. వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ!

  • నేడు వైసీపీలో చేరనున్న మాగుంట
  • బాలినేనితో వైవీకి విభేదాలు
  • మాగుంట వైపే మొగ్గు చూపిన జగన్

టీడీపీ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నేడు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు ఈ స్థానం నుంచి పోటీ చేసిన జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ అవకాశం కల్పిస్తామని అధిష్ఠానం నచ్చజెప్పినట్టు తెలుస్తోంది.

వైసీపీ కీలకనేత బాలినేని శ్రీనివాసరెడ్డితో వైవీకి అభిప్రాయ భేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలినేనితో పాటు ఒంగోలు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల డిమాండ్లు కూడా మాగుంటకు తోడ్పడ్డాయి. మరోవైపు, తన కుమారుడితో కలసి జగన్ తో వైవీ సుబ్బారెడ్డి తుది చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అయినా, మాగుంట వైపే జగన్ మొగ్గు చూపారు.

jagan
magunta
yv subba reddy
ysrcp
ongole
  • Loading...

More Telugu News