Telangana: 'పబ్‌జీ గేమ్' ఆడుతుంటే తల్లి మందలింపు.. ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థి

  • అదే పనిగా సెల్‌ఫోన్‌లో గేమ్ ఆడుతున్న విద్యార్థి
  • తల్లి మందలించడంతో మనస్తాపం
  • గజ్వేల్‌లో ఘటన

సెల్‌ఫోన్‌లో గేమ్ ఆడొద్దంటూ తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్‌లోని మల్లారం గ్రామానికి చెందిన వెంకటనారాయణ కుటుంబం గజ్వేల్‌లోని ప్రజ్ఞాపూర్‌లో స్థిరపడింది. వెంకట నారాయణ చిన్న కుమారుడు సాయి శరణ్ (10) స్థానికంగా ఉన్న ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి అదే పనిగా సెల్‌ఫోన్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతున్న కుమారుడిని గమనించిన తల్లి మందలించింది. తల్లి మందలింపుతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయి శరణ్ రాత్రి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana
Siddipet District
Medchal
pragnapur
Pubg game
Suicide
  • Loading...

More Telugu News