Chandrababu: టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఘంటా.. చంద్రబాబును మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యమన్న మురళీ కృష్ణ

  • చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక
  • రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి భేష్
  • మురళీతోపాటు పార్టీలో చేరిన మరికొందరు నేతలు

చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీకృష్ణ సోమవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. సీఎం ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషిని చూసే టీడీపీలో చేరుతున్నట్టు ఈ సందర్బంగా ఘంటా మురళీ పేర్కొన్నారు. చంద్రబాబును మళ్లీ సీఎంను చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

కాగా, ఘంటా మురళీతోపాటు ఘంటా సత్యంబాబు, బొప్పన అంజయ్య, టి.లక్ష్మయ్య, కేశవరావు, సుబ్బారావు, బొల్లినేని శ్రీనివాసరావు, వెల్ది కృష్ణమూర్తి, పెండ్యాల ప్రసాద్ కూడా టీడీపీలో చేరారు. 2014లో వైసీపీలో చేరిన ఘంటా మురళీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. అయితే, గత కొన్ని రోజులుగా అధిష్ఠానం తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆయన వైసీపీకి దూరమయ్యారు.

Chandrababu
Telugudesam
Chintalapudi
Ghanta muralikrishna
YSRCP
  • Loading...

More Telugu News