Rahul Gandhi: మసూద్‌ని ‘జీ’ అని సంబోధించిన రాహుల్.. ఏకి పారేస్తున్న బీజేపీ!

  • కాందహార్ ఘటనను ప్రస్తావించిన రాహుల్
  • ఎన్డీయే ప్రభుత్వమే విడిచిపెట్టిందని వెల్లడి
  • అజిత్ దోవల్ స్వయంగా అప్పగించారన్న రాహుల్

అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మసూద్‌ని ‘జీ’ అంటూ గౌరవంగా సంబోధించి చిక్కుల్లో పడ్డారు. రాహుల్ ఎప్పుడు చిక్కుతారా? అని చూసే బీజేపీకి ఇదో మంచి అస్త్రంలా మారింది. అంతర్జాతీయ ఉగ్రవాదిని ‘జీ’ అంటూ సంబోధించడమేంటని బీజేపీ ఏకి పారేస్తోంది. నేడు ఢిల్లీలో రాహుల్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

దీనిలో భాగంగా కాందహార్ ఘటనను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మసూద్ ‘జీ’ని అప్పటి ఎన్డీయే ప్రభుత్వమే విడిచిపెట్టిందని.. ఇప్పటి  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అప్పట్లో స్వయంగా కాందహార్ వెళ్లి మరీ అప్పగించారని తెలిపారు. దీంతో బీజేపీ.. రాహుల్‌కూ, పాక్‌కూ ఉగ్రవాదులంటే అమితమైన ప్రేమ అని అంతర్జాతీయ టెర్రరిస్టును ‘జీ’ అంటూ సంబోదిస్తారా? అంటూ విరుచుకుపడింది. టెర్రరిస్టులను గౌరవించడమంటే పరోక్షంగా పుల్వామా అమరవీరులను అవమానించడమేనంటూ స్మృతి ఇరానీ.. రాహుల్‌ని విమర్శించారు.

  • Loading...

More Telugu News