Chandrababu: ఇటు అభ్యర్థుల ఖరారు.. అటు బుజ్జగింపులను ఏకకాలంలో చేస్తున్న చంద్రబాబు

  • నియోజకవర్గాల నేతలతో సమీక్ష
  • బాగా తగులుతున్న అసంతృప్తుల సెగ
  • కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారు

ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఖరారు పెద్ద ప్రయాసగా మారుతోంది. అసంతృప్తులు లేకుండా చూసుకోవడం ఏ పార్టీకైనా కత్తిమీద సామే. ప్రస్తుతం టీడీపీకి అసంతృప్తుల సెగ బాగా తగులుతోంది. టీడీపీ అధినేత ఇటు అభ్యర్థుల ఖరారు మాత్రమే కాకుండా.. మరోపక్క అసంతృప్తుల బుజ్జగింపు పనులను కూడా ఏకకాలంలో నిర్వహిస్తున్నారు.

నేడు ఆయన గుడివాడ, చీపురుపల్లి, నిడదవోలు, పాతపట్నం, అవనిగడ్డ, కొవ్వూరు, గూడురు, పాయకరావుపేట నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా గుడివాడ, నిడదవోలు, అవనిగడ్డ, గూడూరు అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే ఇక్కడ ప్రకటించిన అభ్యర్థులపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో చంద్రబాబు బుజ్జగింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ కొవ్వూరు, పాతపట్నం, చీపురుపల్లి, పాయకరావుపేట నియోజకవర్గాల అభ్యర్థులపై స్పష్టత రాలేదు.

Chandrababu
Gudivada
Cheepurupalli
Pathapatnam
Avanigadda
Kovvuru
  • Loading...

More Telugu News