Pawan Kalyan: ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తే వాళ్లకే నష్టం!: అలీ

  • జనసేనాని గురించి చెప్పిన స్టార్ కమెడియన్
  • పవన్ నాకు మంచి స్నేహితుడు
  • ట్రోల్ చేస్తే అభిమానులకే నష్టం

టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా ఏ పార్టీలో చేరాలా అని తెగ ఊగిపోయిన అలీ చివరికి జగన్ నాయకత్వంలోని వైసీపీలో చేరడంతో పొలిటికల్ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. అలీని ఆకర్షించేంతగా జగన్ ఏం హామీ ఇచ్చుంటాడోనని సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చ జరిగింది.

దీనిపై అలీ స్పష్టతనిచ్చాడు. తాను సినిమాల్లో ఎన్టీఆర్ కు అభిమానినని, రాజకీయాల్లో మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానినని తెలిపారు. వైఎస్సార్ తనయుడు జగన్ నడిపిస్తున్న వైసీపీ విధివిధానాలు నచ్చడంతోనే ఆ పార్టీలో జాయిన్ అయ్యానని వెల్లడించారు. అయితే అంతకుముందు తనకు, పవన్ కల్యాణ్ కు మధ్య జరిగిన సంభాషణను కూడా అలీ ఈ సందర్భంగా బయటపెట్టారు.

 గతంలో తాను జనసేన పార్టీలో చేరాలని ప్రయత్నిస్తే పవన్ కల్యాణే వద్దన్నాడని చెప్పారు. రాజకీయాల్లో తనతో కలిసి నడిస్తే ఎన్నో ఇబ్బందులు ఉంటాయని, స్నేహితులను సమస్యల పాల్జేయడం ఇష్టంలేదని అన్నాడని వివరించారు. నీకిష్టం వచ్చిన పార్టీలో చేరు అని పవన్ ఇచ్చిన సలహాతోనే స్వేచ్ఛగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నానని అలీ వెల్లడించారు. అంతేతప్ప, పవన్ ను కాదని తాను వైసీపీలోకి వెళ్లినట్టు కాదని స్పష్టం చేశారు. దీన్ని ఫ్యాన్స్ తప్పుగా అర్థం చేసుకోరని భావిస్తున్నానని, ఒకవేళ ఎవరైనా ట్రోల్ చేస్తే వాళ్లకే నష్టం అని అన్నారు.

  • Loading...

More Telugu News