USA: ఆకాశంలో విషాదం.. పారాగ్లైడింగ్ చేస్తూ పరస్పరం ఢీకొని ఇద్దరి మృతి
- ఆమెరికాలో దుర్ఘటన
- 75 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన వైనం
- చిన్నపొరబాటుకు భారీ మూల్యం
అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆకాశంలో ఇద్దరు పారాగ్లైడర్లు ప్రమాదవశాత్తు ఒకరినొకరు ఢీకొని మృత్యువాత పడ్డారు. శాన్ డియాగో బ్లాక్ బీచ్ సమీపంలో ఉన్న పారాగ్లైడింగ్ పాయింట్ నుంచి గాల్లోకి ఎగిసిన ఈ ఇద్దరు కొద్దిసేపటికే అనుకోని రీతిలో పరస్పరం గుద్దుకున్నారు. దాంతో, 75 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోవడంతో తీవ్రగాయాలతో మరణించారు. వారి వయసు 61, 43 సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు. అయితే వాళ్లెవరన్నది ఇంకా గుర్తించలేదు. ఇద్దరిలో ఒకరు మలుపు తిరిగే క్రమంలో తన పారాగ్లైడర్ ను నియంత్రించడంలో విఫలం కావడంతో ఎదురుగా వస్తున్న మరో పారాగ్లైడర్ ను బలంగా తాకింది. దాంతో ఇద్దరు పారాగ్లైడర్లు కిందికి పడిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.