nannapaneni: పల్నాడు ప్రాంతంలోనే ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి: నన్నపనేని

  • గుంటూరు జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం
  • బాధితురాళ్లను పరామర్శించిన నన్నపనేని
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ  

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అత్యాచారాలకు గురైన మైనర్ బాలికలను ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అత్యాచారాలకు పాల్పడిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు మైనర్ బాలికలపై వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అత్యాచారాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. పల్నాడు ప్రాంతంలోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు.

nannapaneni
rajakumari
palnadu
rape
  • Loading...

More Telugu News