Revanth Reddy: హైకోర్టులో రేవంత్ రెడ్డికి చుక్కెదురు.. అరెస్టుపై పిటిషన్ కొట్టివేత

  • అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ అరెస్ట్ పై పిటిషన్
  • అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపణ
  • ఆధారాలు చూపించలేదంటూ పిటిషన్ కొట్టివేత

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొడంగల్ లో రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారనే పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. రేవంత్ అరెస్ట్ ను సవాల్ చేస్తూ వేం నరేందర్ రెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు విచారించిన హైకోర్టు... రేవంత్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని నిరూపించడానికి సరైన ఆధారాలను చూపించలేదని పేర్కొంటూ పిటిషన్ ను కొట్టివేసింది. 

Revanth Reddy
High Court
vem narender reddy
congress
arrest
petetion
  • Loading...

More Telugu News